డాలర్ భాయ్ అరెస్ట్

by  |
డాలర్ భాయ్ అరెస్ట్
X

దిశ, వెబ్‎డెస్క్: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న డాలర్‌ భాయ్‌ని సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

2011 నుంచి తనపై 139 మంది అత్యాచారం జరిపారంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దానిలో సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లను సైతం వెల్లడించింది. అయితే ఇదంతా తనతో డాలర్‌ భాయ్‌ చేయించాడని.. తన పట్ల సైకోలా వ్యవహరించాడని చెప్పి సదరు యువతి షాక్ ఇచ్చింది. ఆగస్టు 20వ తేదరీన డాలర్ భాయ్‌పై సదరు యువతి కేసు నమోదు చేసింది. ఇప్పటికే సీసీఎస్‌ పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి విచారించారు. ఎట్టకేలకు ఈ కేసులో శుక్రవారం డాలర్ భాయ్‎ను అరెస్ట్ చేశారు.



Next Story

Most Viewed