కాసేపట్లో CBSE పదో తరగతి ఫలితాల విడుదల..

by Shyam |   (  Updated:2021-08-03 00:34:54  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (CBSE) 10వ తరగతి ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్‌ఈ బోర్డు పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన బోర్డు తాజాగా 10వ తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు సిద్దమయ్యింది. అయితే, కొవిడ్ నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను కేంద్రం ఆదేశాల మేరకు బోర్డు రద్దు చేసిన విషయం తెలిసిందే. పరీక్షలు [&hellip;]</p>

కాసేపట్లో CBSE పదో తరగతి ఫలితాల విడుదల..
X

దిశ, వెబ్‌డెస్క్ : సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (CBSE) 10వ తరగతి ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్‌ఈ బోర్డు పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన బోర్డు తాజాగా 10వ తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు సిద్దమయ్యింది. అయితే, కొవిడ్ నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను కేంద్రం ఆదేశాల మేరకు బోర్డు రద్దు చేసిన విషయం తెలిసిందే. పరీక్షలు లేకుండానే ఈ ఏడాది విద్యార్థులను నేరుగా పాస్ చేసి పై తరగతులకు ప్రమోట్ చేయనున్నారు. ఫలితాల కోసం విద్యార్థులు కింది లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చును.

https://cbseresults.nic.in

https://cbse.gov.in

Next Story