- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివేకా హత్య కేసు.. ఢిల్లీ వెళ్లిన సీబీఐ బృందం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో తాత్కాలిక విరామం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు కడప నుంచి ఢిల్లీకి వెళ్లారు. తొలుత రెండు వారాల ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు.. కడప, పులివెందులలో విచారణ చేపట్టారు. వివేకా కుమార్తె సునీత, వైసీపీ నేత శివశంకర్ రెడ్డి, ఏపీ కృష్ణా రెడ్డి, విచారించారు. అనంతరం కడప […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో తాత్కాలిక విరామం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు కడప నుంచి ఢిల్లీకి వెళ్లారు.
తొలుత రెండు వారాల ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు.. కడప, పులివెందులలో విచారణ చేపట్టారు. వివేకా కుమార్తె సునీత, వైసీపీ నేత శివశంకర్ రెడ్డి, ఏపీ కృష్ణా రెడ్డి, విచారించారు. అనంతరం కడప జైలులో వివేకానందరెడ్డి వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మీదేవి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయ్ తుల్లాను అధికారులు విచారించారు. తాత్కాలిక విరామం తీసుకున్న అధికారులు.. మళ్లీ విచారణ ఎప్పుడు మొదలుపెడుతారో వేచి చూడాల్సిందే.
Next Story






