‘కేసీఆర్ ఆస్తులపై సీబీఐ విచారణ చేపట్టాలి’

by  |
‘కేసీఆర్ ఆస్తులపై సీబీఐ విచారణ చేపట్టాలి’
X

దిశ, మాహబూబాబాద్ : సీఎం కేసీఆర్ అభద్రతాభావానికి పరాకాష్ట నిలుస్తూ ఈటెలపై భూదందా ఆరోపణలకు తెరలేపాడని జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 9వ వార్డు పరిధిలో ఈటెలకు జరిగిన అన్యాయానికి ప్లే కార్డు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పోకడలతో పాలన సాగుతోందన్నారు. తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై భూదందా అభియోగం మోపుతూ మంత్రి పదవి నుండి బర్తరఫ్ చెయ్యడం అమానుషమైన చర్య అని మండిపడ్డారు.

కుట్రపూరితంగా బిసి నేత ఈటెలపై అసైన్డ్ భూఆక్రమణ కేసును బనాయించి ఈటెలను ఒక దోషిగా నిలబెట్టడం బిసిల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయతడమే అని అన్నారు. నిజంగా కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి మల్లారెడ్డి, మై హోమ్ అధినేత రామేశ్వర్ రావు తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికార పార్టీ నేతలపై ఎందుకు విచారణకు అదేశించలేదని ప్రశ్నించారు. వారికో నీతి ఈటెలకో నీతా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆటోలో తిరిగిన నేతలు ఇయ్యాల వందలకోట్లు సంపాదించి బెంజ్ కార్లలో తిరుగుతున్నారని వారందరిపై విచారణ చేపట్టి కేసీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆస్తుల గ్రాఫ్ ను సిబిఐ చే దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed