- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంట్లో సీబీఐ సోదాలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇంట్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన ఇళ్లలో తనిఖీలు చేపట్టాయి. ఇందు, భారత్ కంపెనీ సహా మొత్తం 12 కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలో ఏకకాలంలో గురువారం ఉదయం 6గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. అయితే గతంలో సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగానే ప్రస్తుత తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తుండగా ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇంట్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన ఇళ్లలో తనిఖీలు చేపట్టాయి. ఇందు, భారత్ కంపెనీ సహా మొత్తం 12 కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలో ఏకకాలంలో గురువారం ఉదయం 6గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. అయితే గతంలో సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగానే ప్రస్తుత తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తుండగా ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలోని రఘురామ కృష్ణంరాజు గెస్ట్‌హౌస్‌తో పాటు హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసం, ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు కీలక పత్రాలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story






