వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చార్జి‌షీట్‌ దాఖలు

by  |
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చార్జి‌షీట్‌ దాఖలు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. వైఎస్‌ వివేకా హత్యకు నలుగురు వ్యక్తులు కారణమని బుధవారం ఛార్జి‌షీట్‌లో వెల్లడించింది. గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమా శంకర్‌రెడ్డి, దస్తగిరిపై అభియోగాలు నమోదు చేసింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో నిందితులను అరెస్టు చేశామని పులివెందుల కోర్టుకు సీబీఐ తెలిపింది. నిందితులను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించామని పేర్కొంది.

వివేకా హత్య కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులకు గతంలోనే కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని సీబీఐ తెలిపింది. నాలుగు రోజుల క్రితమే దస్తగిరి ముందస్తు బెయిల్‌ పొందినట్లు స్పష్టం చేసింది. కడప జైలులో సునీల్, ఉమాశంకర్ రెడ్డి రిమాండ్‌లో ఉన్నారని కోర్టుకు వెల్లడించింది. ప్రాథమిక ఛార్జి‌షీట్‌ను మంగళవారం దాఖలు చేసిన అధికారులు బుధవారం పూర్తిస్థాయి చార్జి‌షీట్‌ దాఖలు చేశారు.



Next Story

Most Viewed