వైఎస్ వివేకానంద మృతిపై సీబీఐ విచారణ వేగవంతం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం అయ్యింది. కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్‌హౌస్ నుంచి సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మంగళవారం వివేకా కుమార్తె సునీతను అధికారులు విచారించారు. 3గంటల పాటు ఆమె విచారణ కొనసాగింది. విచారణకు తన వద్ద ఉన్న ఆధారాలు, వివిధ డాక్యుమెంట్లను ఆమె తీసుకెళ్లినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ పై తనకు నమ్మకం లేదని, [&hellip;]</p>

వైఎస్ వివేకానంద మృతిపై సీబీఐ విచారణ వేగవంతం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం అయ్యింది. కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్‌హౌస్ నుంచి సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మంగళవారం వివేకా కుమార్తె సునీతను అధికారులు విచారించారు. 3గంటల పాటు ఆమె విచారణ కొనసాగింది. విచారణకు తన వద్ద ఉన్న ఆధారాలు, వివిధ డాక్యుమెంట్లను ఆమె తీసుకెళ్లినట్టు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ పై తనకు నమ్మకం లేదని, సీబీఐ చేత కేసును విచారించాలంటూ సునీత హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆమె పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, పిటిషన్‌లో ఆమె పేర్కొన్న వివరాలను సీబీఐ అధికారులు తెలుసుకున్నారు. తనకు అనుమానం ఉన్న 15 మంది వ్యక్తుల పేర్లను కూడా తెలిపారు.

మరోవైపు సస్పెన్షన్‌కు గురైన పులివెందుల సీఐ శంకరయ్యను సీబీఐ అధికారులు రెండో రోజు విచారించారు. నిన్న కూడా ఆయన్ను నాలుగు గంటల సేపు విచారించారు. వివేకా హత్య జరిగిన సమయంలో శంకరయ్య సీఐగా కొనసాగారు.

Next Story