అర్ధరాత్రి న్యూసెన్స్.. మెగాడాటర్ నిహారిక భర్తపై కేసు నమోదు

by  |
అర్ధరాత్రి న్యూసెన్స్.. మెగాడాటర్ నిహారిక భర్తపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. అర్ధరాత్రి నిహారిక అపార్ట్‌మెంటులో చైతన్య న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడంటూ అపార్టుమెంటు వాసులంతా చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం అర్ధరాత్రి నిహారిక అపార్టుమెంట్ లో ఒక్కసారిగా కేకలు వినిపించాయి. దీంతో కంగారు పడిన అపార్ట్ మెంట్ వాసులు వారింటికి వెళ్లగా.. వారిపై చైతన్య తీవ్ర స్థాయిలో మండిపడ్డట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే అపార్ట్ మెంట్ వాసులకు, చైతన్య జొన్నలగడ్డకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్‏మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్ మెంట్ వాసులపై నిహారిక భర్త సైతం ఫిర్యాదు చేశారు. పోలీసులు పరస్పర ఫిర్యాదులను స్వీకరించి విచారణ నిర్వహిస్తున్నారు. మెగా ప్రిన్సెస్ నిహారికకు గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు.. వ్యాపారవేత్త వెంకట చైతన్య జొన్నలగడ్డతో గత ఏడాది డిసెంబర్‏లో ఘనంగా వివాహం జరిగిన విషయం తెలిసిందే.



Next Story