గేయ రచయిత అనంత శ్రీరామ్ పై కేసు నమోదు.. ఆమెను అవమానించాడంటూ

by Shyam |   (  Updated:2023-12-16 17:06:52  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సినీ ఇండస్ట్రీలో పోలీసు కేసులు ఎక్కువైపోతున్నాయి. తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారని కొన్ని వర్గాలు.. సెలబ్రెటీలపై కేసులు నమోదుచేస్తున్నాయి. ఇక ఇటీవలే సింగర్ మంగ్లీ పాడిన భక్తి పాట వివాదంలో ఇరుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ పై కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తోన్న ‘వరుడు కావలెను’ చిత్రం కోసం అనంత్ శ్రీరామ్  ఒక […]</p>

గేయ రచయిత అనంత శ్రీరామ్ పై కేసు నమోదు.. ఆమెను అవమానించాడంటూ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సినీ ఇండస్ట్రీలో పోలీసు కేసులు ఎక్కువైపోతున్నాయి. తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారని కొన్ని వర్గాలు.. సెలబ్రెటీలపై కేసులు నమోదుచేస్తున్నాయి. ఇక ఇటీవలే సింగర్ మంగ్లీ పాడిన భక్తి పాట వివాదంలో ఇరుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ పై కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తోన్న ‘వరుడు కావలెను’ చిత్రం కోసం అనంత్ శ్రీరామ్ ఒక ఫోక్ సాంగ్ రాశారు. “దిగు దిగు దిగు నాగ” అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం వివాదంలో ఇరుక్కుంది.

తెలంగాణ జానపదం ‘దిగు దిగు దిగు నాగ’ పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్‌తో సాంగ్ చేశారు. దీంతో ఆ లిరిక్స్ పై హిందువులు మండిపడ్డారు. నాగ దేవతను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయని, ప్రస్తుత పాట హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ బిజెపి మహిళా మోర్చా నాయకురాలు బిందు రెడ్డి అనంత శ్రీరామ్ పై కేసు నమోదు చేశారు. ఆ పాటను వెంటనే తొలగించి బేషరుతుగా చిత్ర దర్శక, నిర్మాతలు క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు.

Next Story