illegal Water Tap Connection : అక్రమ నల్లా కనెక్షన్లపై కేసు

by Batti.Sumithra |   (  Updated:2021-05-27 10:52:55  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో : అక్రమంగా నల్లా కనెక్షన్‌ పొందిన ఇద్దరిపై జలమండలి విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హుమాయున్‌నగర్ లోని కబీర్ క్లాసిక్ అపార్ట్‌మెంట్ యజమాని ఉస్మాన్, హకీమ్ ఖాన్ అనుమతి లేకుండా నల్లా కనెక్షన్లు తీసుకున్నట్టు గుర్తించారు. వారిపై హుమాయిన్‌నగర్ పోలీస్‌స్టేషన్ లో పలు సెక్షన్ల కింద క్రిమనల్ కేసులు నమోదు చేశారు. అక్రమ నల్లాలను గుర్తించేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, అనుమతులు లేకుండా నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు [&hellip;]</p>

illegal Water Tap Connection : అక్రమ నల్లా కనెక్షన్లపై కేసు
X

దిశ, తెలంగాణ బ్యూరో : అక్రమంగా నల్లా కనెక్షన్‌ పొందిన ఇద్దరిపై జలమండలి విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హుమాయున్‌నగర్ లోని కబీర్ క్లాసిక్ అపార్ట్‌మెంట్ యజమాని ఉస్మాన్, హకీమ్ ఖాన్ అనుమతి లేకుండా నల్లా కనెక్షన్లు తీసుకున్నట్టు గుర్తించారు. వారిపై హుమాయిన్‌నగర్ పోలీస్‌స్టేషన్ లో పలు సెక్షన్ల కింద క్రిమనల్ కేసులు నమోదు చేశారు. అక్రమ నల్లాలను గుర్తించేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, అనుమతులు లేకుండా నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందానికి లేదా 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని జలమండలి కోరింది.

Next Story