- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గన్ పట్టిన ‘గులాబీ’ లీడర్‌పై కేసు..
<p>దిశ, క్రైమ్ బ్యూరో : టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షులు కట్టెల శ్రీనివాస్ యాదవ్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిని సురభి వాణిదేవి విజయోత్సవ సంబురాల్లో తుపాకీ పేల్చి కలకలం సృష్టించిన విషయం తెల్సిందే. తెలంగాణ భవన్‌లో యథేచ్చగా తుపాకీ కాల్పులు కలకలంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. గన్ పట్టింది గ్రేటర్ మాజీ అధ్యక్షులు కట్టెల శ్రీనివాస్ యాదవ్ కావడంతో మరింత హాట్ టాపిక్‌గా […]</p>

దిశ, క్రైమ్ బ్యూరో : టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షులు కట్టెల శ్రీనివాస్ యాదవ్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిని సురభి వాణిదేవి విజయోత్సవ సంబురాల్లో తుపాకీ పేల్చి కలకలం సృష్టించిన విషయం తెల్సిందే. తెలంగాణ భవన్‌లో యథేచ్చగా తుపాకీ కాల్పులు కలకలంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. గన్ పట్టింది గ్రేటర్ మాజీ అధ్యక్షులు కట్టెల శ్రీనివాస్ యాదవ్ కావడంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇది నిజమైన తుపాకీ కాదనీ, లైటర్‌గా వినియోగించే బొమ్మ తుపాకీ మాత్రమేనని, కట్టెల శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు. ఈ కాల్పులపై విపక్షాల విమర్శలకు తోడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ కావడంతో అధికార పార్టీ నాయకులు ఏం చేసినా.. పోలీసులు ఏమీ అనడం లేదనే విమర్శలు వచ్చాయి.
దీంతో ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు స్థానిక సెక్టార్ ఎస్ఐ నుంచి ఫిర్యాదు తీసుకుని (సుమోటో) ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. బంజారాహిల్స్ పీఎస్ ఇన్‌స్పెక్టర్ కళింగరావును వివరణ కోరగా, కట్టెల శ్రీనివాస్ యాదవ్ పై ఎఫ్ఐఆర్ కాలేదని, ఫిర్యాదు అందినట్టు చెప్పారు. ఇదిలాఉండగా, కట్టెల శ్రీనివాస్ యాదవ్ పేల్చిన తుపాకీ అసలైందా.. టాయ్ పిస్టలా అని తేల్చేందుకు పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించినట్టుగా తెలుస్తోంది. ఈ తుపాకీ నిజంగా టాయ్ పిస్టల్ అయినందున ఎఫ్ఐఆర్ నుంచి తప్పించాలనే ఉద్దేశ్యంలో పోలీసులు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం.. బహిరంగ ప్రదేశాలలో టాయ్ పిస్టల్ ప్రదర్శించిన వారిపై కూడా కేసు నమోదు చేయడానికి నిబంధనలు ఉన్నందున.. మరీ, తెలంగాణ భవన్‌లో తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన కట్టెల శ్రీనివాస్ యాదవ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. బంజారాహిల్స్ పోలీసులు మాత్రం ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ 30 ఆఫ్ యూ/ఎస్ 25(1) (బీ)(ఎ) ప్రకారం క్రైమ్ నెంబరు 244/2021గా కేసు నమోదు చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం.






