మాజీ మంత్రి ఈటల అనుచరునిపై కేసు ఫైల్

by Sridhar Babu |

<p>దిశ, కరీంనగర్ సిటీ : మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరుడు పోలు లక్ష్మణ్ పై నగరంలోని రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. టీఆర్ఎస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, విలేకరుల సమావేశం నిర్వహించాడంటూ నగరంలోని సుభాష్ నగర్‌కు చెందిన డిష్ ఆపరేటర్ రాయనవేని శ్రవణ్ ముదిరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై ఐపీసీ 153, 505( 2) గురువారం కేసు నమోదైంది. ఉత్తర తెలంగాణ [&hellip;]</p>

మాజీ మంత్రి ఈటల అనుచరునిపై కేసు ఫైల్
X

దిశ, కరీంనగర్ సిటీ : మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరుడు పోలు లక్ష్మణ్ పై నగరంలోని రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. టీఆర్ఎస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, విలేకరుల సమావేశం నిర్వహించాడంటూ నగరంలోని సుభాష్ నగర్‌కు చెందిన డిష్ ఆపరేటర్ రాయనవేని శ్రవణ్ ముదిరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై ఐపీసీ 153, 505( 2) గురువారం కేసు నమోదైంది.

ఉత్తర తెలంగాణ భవన్‌ను స్వాధీనం చేసుకుంటామని, ప్రగతి భవన్ పై రాళ్ళ దాడి చేస్తామంటూ బెదిరింపులకు గురిచేసే వ్యాఖ్యలు చేసినట్లు, అలాగే మంత్రి గంగుల కమలాకర్ ఈటల కాలి గోటికి కూడా సరిపోడంటూ అవమానకరంగా మాట్లాడాడంటూ ఫిర్యాదు పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ ఎస్ఐ తెలిపారు.

Next Story