IRS ఆఫీసర్‌కు సాయం.. NIA మాజీ ఆఫీసర్‌పై కేసు!

by  |
IRS ఆఫీసర్‌కు సాయం.. NIA మాజీ ఆఫీసర్‌పై కేసు!
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి కుటుంబానికి సాయం చేసే క్రమంలో జాతీయస్థాయి కేడర్ ఉన్న మరో అధికారి అడ్డంగా బుక్కయ్యాడు.ఈ విషయం ప్రస్తుతం సంబంధిత అధికారిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మాజీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) జలజ్ శ్రీవాస్తవపై సీబీఐ (CBI)కేసు నమోదు చేసింది. IRS అధికారి సన్సార్ చంద్, ఆయన భార్య అవినాశ్ కౌర్‌లకు సాయం చేసేందుకు మోసపూరితంగా కాల్ డిటైల్ రికార్డ్స్ (CDRS)లను పొందినందుకు ఆయనపై కేసు నమోదైంది. అయితే, సన్సార్ చంద్,అవినాశ్ కౌర్‌లను ఫిబ్రవరి 2018లోనే దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది.

ఇన్నిరోజులుNIAలో విధులు నిర్వర్తించిన శ్రీవాస్తవ ఈ మధ్యే తన పేరెంట్ కేడర్ అయిన (BSF)లో చేరారు. ప్రస్తుతం ఆయన మణిపూర్‌లోని ఇంఫాల్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినాశ్ కౌర్ అభ్యర్థన మేరకు శ్రీవాస్తవ 2017, 2018 సంవత్సరాల్లో రెండు CDRSలను NIAలోని తన సీనియర్ ఏడీ నేగి, IPS అధికారి అనుమతి లేకుండా యాక్సెస్ చేసి కౌర్‌కు అందజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

దీనిని తీవ్రంగా పరిగణించిన NIA డైరెక్టర్ జనరల్ విచారణ నిమిత్తం ఈ కేసును CBIకు రిఫర్ చేశారు. ఈమేరకు ఆయనపై అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం నేరపూరిత దుష్ప్రవర్తన కింద సీబీఐ కేసు నమోదు చేసింది.

బీఎస్ఎఫ్‌లోని 182వ బెటాలియన్‌లో పనిచేస్తున్న శ్రీవాస్తవకు సన్సార్ చంద్, కౌర్‌లతో పరిచయం ఉంది. అందువల్లే సీబీఐ కేసులో వారికి సాయం చేయాలని శ్రీవాస్తవ నిర్ణయించారు. అందులో భాగంగానే సుదేశ్ సైనీ అనే వ్యక్తి కాల్ రికార్డులను అక్రమంగా సంపాదించి వారికి అందించారు. 1986 బ్యాచ్ IRS అధికారి అయిన సన్సార్ చంద్ కాన్పూరులో GST అధికారిగా పనిచేస్తున్నప్పుడు ఓ వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఫిబ్రవరి 2018లో ఆయనపై దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది.


Next Story

Most Viewed