- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వారిపై కేసు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసినందుకు నిరసన వ్యక్తం చేస్తూ ఇటీవల సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన సంఘటనలో మహబూబ్‌నగర్ టూ టౌన్ పోలీసులు పది మందిపై కేసు నమోదు చేశారు. ఈటెల రాజేందర్‌కు మద్దతుగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఈనెల 4వ తేదీన సీఎం దిష్టిబొమ్మను ముదిరాజ్ సంఘం నేతలు దగ్ధం చేశారు. ఈ క్రమంలో టూ టౌన్ పోలీసులు ముదిరాజ్ సంఘం […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసినందుకు నిరసన వ్యక్తం చేస్తూ ఇటీవల సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన సంఘటనలో మహబూబ్‌నగర్ టూ టౌన్ పోలీసులు పది మందిపై కేసు నమోదు చేశారు. ఈటెల రాజేందర్‌కు మద్దతుగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఈనెల 4వ తేదీన సీఎం దిష్టిబొమ్మను ముదిరాజ్ సంఘం నేతలు దగ్ధం చేశారు. ఈ క్రమంలో టూ టౌన్ పోలీసులు ముదిరాజ్ సంఘం నేతలు కృష్ణ ముదిరాజ్, గోనెల శ్రీనివాస్ ముదిరాజ్, దోమ పరమేశ్వర్ ముదిరాజ్, మేకల మహేష్, యాదయ్య, రాములు, ఆంజనేయులు, శేఖర్, వెంకటేష్ తదితరులపై కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకొని.. సాయంత్రానికి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.
Next Story






