- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విచారణ కోసం వెళ్తే కుక్కలను వదిలిన పీవీపీ
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ మరో సారి వార్తల్లోకెక్కారు. విచారణ కోసం వెళ్తే పోలీసులపై తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పారని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. వివరాళ్లోకి వెళితే.. గత వారం తన ఇంటి నిర్మాణానికి పీవీపీ అడ్డుపడుతున్నాడని ఆరోపిస్తూ.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసు విషయంలో ఎస్సై హరీష్ రెడ్డి బృందం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.82లో ఉన్న పీవీపీ […]</p>

X
దిశ, హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ మరో సారి వార్తల్లోకెక్కారు. విచారణ కోసం వెళ్తే పోలీసులపై తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పారని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. వివరాళ్లోకి వెళితే.. గత వారం తన ఇంటి నిర్మాణానికి పీవీపీ అడ్డుపడుతున్నాడని ఆరోపిస్తూ.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసు విషయంలో ఎస్సై హరీష్ రెడ్డి బృందం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.82లో ఉన్న పీవీపీ ఇంటికి విచారణ కోసం వెళ్లారు. అయితే, పీవీపీ విచారణకు సహకరించకపోగా.. ఏకంగా కుక్కలను వదలడంతో.. పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ నేపథ్యంలోనే జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 353 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
Next Story






