- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా సామ్రాజ్యవాదుల సృష్టి: మావోయిస్టు కేంద్ర కమిటీ
<p>కరోనాపై మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. కరోనా వైరస్ సామ్రాజ్యవాదులు సృష్టించిందేనని.. సామ్రాజ్యవాదాన్ని నిర్మూలించడంతోనే కరోనాను అరికట్టగలమని పేర్కొంది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోతున్న అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని కమిటీ కేంద్రాన్ని కోరింది. దశలవారీగా లాక్ డౌన్‌ను సడలించాలని, కరోనాపై కేంద్రం పోరాటం చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు ఉందని మండిపడింది. వెంటనే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందుల ఎగుమతిపై నిషేధం విధించాలని […]</p>
కరోనాపై మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. కరోనా వైరస్ సామ్రాజ్యవాదులు సృష్టించిందేనని.. సామ్రాజ్యవాదాన్ని నిర్మూలించడంతోనే కరోనాను అరికట్టగలమని పేర్కొంది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోతున్న అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని కమిటీ కేంద్రాన్ని కోరింది. దశలవారీగా లాక్ డౌన్‌ను సడలించాలని, కరోనాపై కేంద్రం పోరాటం చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు ఉందని మండిపడింది. వెంటనే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందుల ఎగుమతిపై నిషేధం విధించాలని లేఖలో కోరింది. బీజేపీ ఒక కమ్యూనిటీపై కరోనా నెపం నెట్టి మతం రంగు పులుముతోందని దుయ్యబట్టింది. ముస్లింలను సామాజికంగా వెలివేసే కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిందని లేఖలో మావోయిస్టు కేంద్ర కమిటీ మండిపడింది. అక్రమ కేసుల్లో జైళ్లల్లో మగ్గుతున్న ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
Tags: Maoist central committee, letter, carona, central governoment






