కర్నూలులో కరోనా విజృంభణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-04-05 23:58:21  IST  )

<p>కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. శనివారం నాటికి కేసుల సంఖ్య 4గా ఉండగా, ఆదివారం నాడు 52 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 56కు చేరింది. ఒక్కసారిగి పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో జిల్లా వాసుల్లో ఆందోళన పెరిగింది. ఇప్పటి వరకు 463 శాంపిళ్లను ల్యాబ్‌లకు పంపించారు. 307 శాంపిళ్లను పరీక్షించగా 56 పాజిటివ్‌గా తేలాయి. మరో 156 ఫలితాలు తెలియాల్సి ఉంది. పాజిటివ్ కేసులో 55 మంది [&hellip;]</p>

కర్నూలులో కరోనా విజృంభణ
X

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. శనివారం నాటికి కేసుల సంఖ్య 4గా ఉండగా, ఆదివారం నాడు 52 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 56కు చేరింది. ఒక్కసారిగి పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో జిల్లా వాసుల్లో ఆందోళన పెరిగింది. ఇప్పటి వరకు 463 శాంపిళ్లను ల్యాబ్‌లకు పంపించారు. 307 శాంపిళ్లను పరీక్షించగా 56 పాజిటివ్‌గా తేలాయి. మరో 156 ఫలితాలు తెలియాల్సి ఉంది. పాజిటివ్ కేసులో 55 మంది ఢిల్లీ వెళ్లివచ్చిన వారు ఉన్నారు.
కర్నూలులో 19, నంద్యాలలో 12, నందికొట్కూరులో 3, బనగానపల్లెలో 4, అవుకులో 2, కోడుమూరులో 3, పాణ్యంలో 4, గడివేములలో 2, రుద్రవరంలో 1, బేతంచెర్లలో 1 కేసు నమోదు అయింది. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. పట్టణాల్లో మూడు కిలోమీటర్ల వరకు కంటైన్మెంట్‌ జోన్‌గా, 5 కిలోమీటర్ల వరకు బఫర్‌ జోన్‌గా, గ్రామీణ ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల వరకు కంటైన్మెంట్‌ జోన్, ఏడు కిలోమీటర్ల వరకు బఫర్‌ జోన్లుగా ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా లౌక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ కె.ఫక్కీరప్ప తెలియజేశారు.

Tags: carona, kurnool, ap news

Next Story