స్కూళ్లో ఎనిమిదేళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఆయా.. చివరకు..

by  |
sexually harassment
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆయా అంటే తల్లి తర్వాత అంత కేర్‌గా చూసుకునే మనిషి. కానీ ఓ ఆయా కామంతో కళ్లు మూసుకుపోయి తల్లి ప్రేమను పంచాల్సిందిపోయి.. బాలుడిని కామించింది. ఎనిమిదేళ్ల బాలుడిని లైంగికంగా వేధించింది. 2017లో చాంద్రయన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తోన్న మహిళ ఎనిమిదేళ్ల బాలుడిని లైంగికంగా వేధింపులకు గురి చేసింది. దీనిపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆయాను కోర్టులో ప్రవేశపెట్టారు. తాజాగా గురువారం కేసును విచారించిన కోర్టు.. బాలుడిని ఆయా లైంగికంగా వేధించినట్లు రుజువు కావడంతో 20 ఏళ్ల జైలు శిక్ష వేస్తూ తీర్పునిచ్చింది. జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానాను కూడా న్యాయస్థానం విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను క్రైం అడిషనల్ సీపీ శిఖాగోయల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.


Next Story

Most Viewed