UGC NET ఫలితాల విడుదల

by Muthe.Rajitha |   (  Updated:2025-07-21 14:54:47  IST  )

UGC NET (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదల అయ్యాయి.

UGC NET ఫలితాల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : UGC NET (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదల అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 2025 సెషన్‌కు సంబంధించిన NET ఫలితాలు నేడు విడుదల చేసింది. ఈ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.inలో అందుబాటులో ఉన్నాయి. ఈ పరీక్షను జూన్ 18 నుండి జూన్ 21 వరకు, 85 సబ్జెక్టులలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించారు. ఫలితాలతో పాటు, సబ్జెక్టు, కేటగిరీ వారీగా కటాఫ్ మార్కులు, ఫైనల్ ఆన్సర్ కీ కూడా విడుదల అయ్యింది. అర్హత సాధించిన అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్, PhD ప్రవేశానికి అర్హులవుతారు. కాగా దేశవ్యాప్తంగా ఏడున్నర లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

Next Story