TET Exam : టెట్ హాల్ టికెట్లు విడుదల.. వచ్చే నెల నుంచి పరీక్షలు

by Ramesh Naini |

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2026) పరీక్షల షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.

TET Exam : టెట్ హాల్ టికెట్లు విడుదల.. వచ్చే నెల నుంచి పరీక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2026) పరీక్షల షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జనవరి 3 నుంచి జనవరి 20 మధ్య మొత్తం 9 రోజుల పాటు 15 సెషన్లలో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు సీబీటీ విధానం ద్వారా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షకు హాజరు కానున్న 2.35లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నడంతో రోజూ రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు ఉంటుందని పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌లో జరిగే పరీక్షలకు అభ్యర్థులు ముందుగానే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకుని, పరీక్షా కేంద్రాలకు సరైన సమయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://schooledu.telangana.gov.in సందర్శించవచ్చని తెలిపారు. జిల్లాల వారీగా కేటాయించిన సెషన్ల వివరాలను ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయాన్ని తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. పేపర్-2 మ్యాథ్స్, సైన్స్ పరీక్షలు జనవరి 3, 4 తేదీల్లో రెండు సెషన్లలో జరుగుతాయి. పేపర్-2 సోషల్ స్టడీస్ జనవరి 5, 6 తేదీల్లో రెండు సెషన్లలో నిర్వహిస్తారు. పేపర్ 1 జనవరి 8, 9, 11 తేదీల్లో వివిధ సెషన్లలో జరుగుతుంది. మైనర్ లాంగ్వేజెస్ జనవరి 19న పేపర్-1 (మైనర్), జనవరి 20న పేపర్-2 (మైనర్) పరీక్షలు అన్ని జిల్లాల అభ్యర్థులకు నిర్వహించనున్నారు.

Next Story