ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్

by Disha Web Desk 21 |
ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్
X

దిశ,వెబ్‌డెస్క్: జనవరి 2024లో ప్రారంభమయ్యే 50వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (టీఈఎస్) కోర్సుశిక్షణలో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 50 కోర్సు (టీఈఎస్) జనవరి ౨౦౨౪
ఖాళీలు: 60
అర్హత:
గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా దానికి సమానమైన పరీక్షతోపాటు జేఈఈ (మెయిన్స్) 2023లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 16 నుంచి 19 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: స్టేజ్ - 1, స్టేజ్ - 2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరితేదీ: జూన్ 30, 2023.
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in

Next Story

Most Viewed