DCCB హైదరాబాద్ లో ఉద్యోగాలు, నెలకు రూ.57వేలకు పైగా వేతనం

by Web Desk |   (  Updated:2022-02-24 08:53:55  IST  )

DCCB హైదరాబాద్ లో ఉద్యోగాలు, నెలకు రూ.57వేలకు పైగా వేతనం
X

నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. హైదరాబాద్ లోని ది హైదరాబాద్‌ డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(DCCB) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 52

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 06

*ఇందులో అసిస్టెంట్‌ మేనేజర్‌–07, స్టాఫ్‌ అసిస్టెంట్‌–45 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. తెలుగు భాషలో ప్రావీణ్యత ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం రెండు దశల్లో ప్రిలిమ్స్, మెయిన్స్‌(ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌) పరీక్షలు నిర్వహిస్తారు. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు ప్రశ్నకు 0.25 మార్కు తొలగిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.17,900 నుంచి రూ.57,860 వరకు వేతనం చెల్లిస్తారు.

*పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్‌.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.hyderabaddccb.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story