పరీక్ష లేకుండానే ఎస్‌బీఐలో ఉద్యోగం.. ఈ అర్హతలుంటే చాలు

by Dishanational1 |
పరీక్ష లేకుండానే ఎస్‌బీఐలో ఉద్యోగం.. ఈ అర్హతలుంటే చాలు
X

దిశ, కెరీర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్.. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

సెక్టార్ క్రెడిట్ స్పెషలిస్ట్ - 16 పోస్టులు

అర్హత: సీఏ, ఎంబీఏ (ఫైనాన్స్), మాస్టర్ డిగ్రీ (ఫైనాన్స్ కంట్రోల్), మాస్టర్ ఇన్ మేనేజ్‌మెంట్ స్టడీస్, పీజీడీఎం (ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

వయసు: అక్టోబర్ 1, 2022 నాటికి 25 నుంచి 35 ఏళ్లు మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 63840 నుంచి రూ. 89,890.

ఎంపిక : షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబర్ 29, 2022.

వెబ్‌సైట్: https://www.sbi.co.in

Next Story