Jobs: నిరుద్యోగ యువతీ యువకులకు రూ.3 లక్షలు.. గొప్ప శుభవార్త..!

by Phanindra |

45 రోజుల పాటు ఈ ట్రైనింగ్ ఇవ్వనున్నారు

Jobs: నిరుద్యోగ యువతీ యువకులకు రూ.3 లక్షలు.. గొప్ప శుభవార్త..!
X

దిశ, వెబ్ డెస్క్ : తల్లి దండ్రులు పిల్లలను కష్ట పడి చదివిస్తారు. చదివిన చదువుకు జాబ్ వస్తే కుటుంబం మొత్తం బాగానే ఉంటుంది. కానీ, ఈ మధ్య కాలంలో ఉద్యోగం రావడం చాలా కష్టంగా మారింది. చాలా మంది ఖాళీగా ఉంటున్నారు. అయితే, నిరుద్యోగ యువతీ యువకులకు ఇదొక గొప్ప అవకాశమని చెప్పొచ్చు. ఫ్రీగా ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత ఉపాధి పొందొచ్చు. ఇంకా రుణ సదుపాయం కూడా ఉంటుంది. దీని వలన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతి నెలా ఎంతో కొంతో ఆదాయం కూడా వస్తుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

సిద్ధిపేటలో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఉంది. దీని ద్వారా ఇప్పటికే ఎంతో మంది శిక్షణ తీసుకొని సొంతంగా డబ్బు సంపాదించుకుంటున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనిలో మొత్తం 15 కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. 45 రోజుల పాటు ఈ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. కోర్సు ఆధారంగా ఈ శిక్షణ కాలం మారుతుంది. టైలరింగ్, సీసీ కెమెరాల ఇన్‌స్టాలేషన్, మగ్గం వర్క్ ఇలా మీకు నచ్చిన కోర్సు ఎంచుకోవచ్చు.

ఈ ట్రైనింగ్ పీరియడ్ లో మీకు ఉచితంగానే భోజన సదుపాయం ఉంటుంది. ఇంకా వసతి కూడా ఉంటుంది. కోర్సు శిక్షణ అయి పోయిన తర్వాత మీకు రుణ సదుపాయం కూడా కల్పిస్తారు. దీని కోసం ఈ సంస్థ కొన్ని బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది. మీ అర్హతల ఆధారంగా రూ. 3 లక్షల వరకు రుణం పొందొచ్చు. దీంతో, మీరు ఎవరి మీద ఆధార పడకుండా సొంతగా ఉపాధి పొందొచ్చు. ఈ అద్భుత అవకాశాన్ని అసలు వదులుకోకండి.

Next Story