ఇంటర్వ్యూ ఆధారంగా DRDOలో ఉద్యోగాలు,నెలకు రూ.54వేల వరకు వేతనం

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీలోనిResearch Associate Jobs in DRDO

ఇంటర్వ్యూ ఆధారంగా DRDOలో ఉద్యోగాలు,నెలకు రూ.54వేల వరకు వేతనం
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీలోని DRDO-న్యూక్లియార్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్(INMAS)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2

*ఇంటర్వ్యూ తేదీలు: 2022 ఏప్రిల్ 8, 11

*ఇందులో రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి కెమిస్ట్రీ/లైఫ్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ పాసై ఉండాలి. సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగానికి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ పాసై ఉండాలి. అలాగే యూజీసీ లో నెట్ అర్హత సాధించి ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 28 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*రీసెర్చ్ అసోసియేట్ జాబ్ ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,000, జూనియర్ రీసెర్చ్ ఫెలో కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.31000 వేతనం చెల్లిస్తారు.

*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఇంటర్వూ వేదిక: DRDO-Inmas, Brig SK Majumdar Marg, Timarpur, Delhi.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.drdo.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story