IIT పాట్నాలో ఉద్యోగాలు, నెలకు రూ.2లక్షల20వేల వరకు వేతనం

by Web Desk |

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పాట్నాలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) స్పెషల్ రిక్రూట్ మెంట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఫిబ్రవరి 28

*కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, సివిల్‌ అండ్‌ ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ పాసై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 32 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,01,500 నుంచి రూ.2,20,000 వేతనం చెల్లిస్తారు.

*ఈమెయిల్‌: [email protected]

*దరఖాస్తు హాార్డ్ కాపీలను Faculty Recruitment Cell, Faculty Affairs Office, IIT Patna-801106, Bihar చిరునామాకి పంపాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://iitp.ac.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story