ITBP 2025 : కానిస్టేబుల్ జాబ్స్‌కు నోటిఫికేషన్ రిలీజ్ .. వెంటనే అప్లై చేయండి..!

by Phanindra |

స్పోర్ట్స్ కోటా 2025 కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఖాళీల నియామకానికి ఉపాధి నోటిఫికేషన్ జారీ చేసింది.

ITBP 2025 :  కానిస్టేబుల్ జాబ్స్‌కు నోటిఫికేషన్ రిలీజ్ .. వెంటనే అప్లై చేయండి..!
X

దిశ, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రిక్రూట్‌మెంట్ లో భాగంగా కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ 04-03-౨౦౨౫ న ప్రారంభమై 02-04-2025 న ముగుస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలకు ఈ లింక్ itbpolice.nic.in పై క్లిక్ చేయండి.

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) స్పోర్ట్స్ కోటా 2025 కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఖాళీల నియామకానికి ఉపాధి నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న వారు నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

జనరల్/ OBC/ UR/ EWS కేటగిరీలకు: రూ. 100/-

SC/ ST/ మహిళా కేటగిరీలకు: NIL

ITBP రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 04-03-2025

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 02-04-2025

ITBP రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి:

కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు

గరిష్ట వయోపరిమితి: 23 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

అర్హత:

అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం :

సవరించిన వేతన మ్యాట్రిక్స్ ప్రకారం వేతనం (7th పే కమిషన్ ప్రకారం) లెవల్-3 - రూ. 21,700 నుండి 69,100/- ను చెల్లిస్తారు.

.

Next Story