ఇస్రోలో 65 సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

by Disha Web Desk 12 |
ఇస్రోలో 65 సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, కెరీర్: ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్.. దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు/యూనిట్‌లలో సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల వివరాలు:

సివిల్ - 39

ఎలక్ట్రికల్ - 14

రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ -9

ఆర్కిటెక్చర్ -1

సివిల్ - అటానమస్ బాడీ-పీఆర్ఎల్ - 1

ఆర్కిటెక్చర్ - అటానమస్ బాడీ -పీఆర్ఎల్ - 1

మొత్తం పోస్టుల సంఖ్య: 65

విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఆర్కిటెక్చర్.

అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఆర్క్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: మే 24, 2023 నాటికి 28 ఏళ్లు మించరాదు.

ప్రారంభ వేతనం: నెలకు రూ. 56, 100 ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: రూ. 250 చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: మే 24, 2023.

వెబ్‌సైట్: https://www.isro.gov.in

ఇవి కూడా చదవండి:

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో 63 పోస్టులు

Next Story

Most Viewed