BARCలో ఉద్యోగాలు, నెలకు రూ.లక్షకు పైగా వేతనం

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ముంబాయి ప్రధానకేంద్రంగా ఉన్నMedical Officer Jobs in BARC

BARCలో ఉద్యోగాలు, నెలకు రూ.లక్షకు పైగా వేతనం
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ముంబాయి ప్రధానకేంద్రంగా ఉన్న బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) పరిధిలోని మెడికల్ డివిజన్.. మెడికల్ ఆఫీసర్‌ (Medical Officer Posts) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూ హాజరు కావచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 11

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 8

*ఇందులో మెడికల్ ఆఫీసర్‌, జనరల్‌ డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

*రేడియాలజీ, ఈఎన్‌టీ, అనెస్తీషియా, అబ్‌స్టెట్రిక్స్ అండ్‌ గైనకాలజీ, ఆప్తల్మాలజీ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ(ఎండీ, ఎంఎస్, డీఎన్ బీ) పాసై ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితకి సంబంధించి 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,02000 వేతనం చెల్లిస్తారు.

*ఇంటర్వ్యూ అడ్రస్: Conference Room 2, BARC Hospital, Anushakti Nagar, Mumbai-400094.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం http://www.barc.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story