ఆంధ్రప్రదేశ్ లోని ఆ జిల్లాలో మెడికల్ ఉద్యోగాలు, దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్

by Dishafeatures1 |
ఆంధ్రప్రదేశ్ లోని ఆ జిల్లాలో మెడికల్ ఉద్యోగాలు, దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(APVVP) కడప జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ విధానంలో మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 15

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 7

*ఇందులో బయోమెడికల్‌ ఇంజనీర్లు–03, పోస్ట్‌మార్టం అసిస్టెంట్‌లు–03, కౌన్సిలర్లు–02, డెంటల్‌ టెక్నీషియన్లు–01, ప్లంబర్‌–04, థియేటర్‌ అసిస్టెంట్‌–01, ఎలక్ట్రీషియన్‌–01 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతు సంబంధించి టెన్త్ క్లాస్, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్‌(బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌) పాసై ఉండాలి. సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000 నుంచి రూ.52,000 వేతనం చెల్లిస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తును Office of the District Coordinator of Hospital Services, Kadapa District, AP చిరునామాకి పంపించాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం https://kadapa.ap.gov.in వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story

Most Viewed