హైదరాబాద్ ఈసీఐఎల్‌లో మేనేజర్ పోస్టులు..

by Disha Web Desk 13 |
హైదరాబాద్ ఈసీఐఎల్‌లో మేనేజర్ పోస్టులు..
X

దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి మంత్రిత్వశాఖకు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కార్పొరేట్ పర్ఛేజ్, హెచ్ఆర్, లా, ఫైనాన్స్ తదితర విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం ఖాళీలు: 11

పోస్టుల వివరాలు :

సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్

డిప్యూటీ జనరల్ మేనేజర్

డిప్యూటీ మేనేజర్

మేనేజర్లు.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ఇంజనీరింగ్ డిగ్రీ/సీఏ/ఎంబీఏ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 32 నుంచి 48 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 50,000 నుంచి రూ. 2.4 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 500 చెల్లించాలి.

దరఖాస్తు: విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

అడ్రస్: డిప్యూటీ జనరల్ మేనేజర్ హ్యూమన్ రిసోర్సెస్ (రిక్రూట్‌మెంట్ సెక్షన్), అడ్మినిష్ట్రేటివ్ బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీస్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈసీఐఎల్ (పోస్ట్), హైదరాబాద్ - 500062, తెలంగాణ.

చివరితేదీ: జూన్ 10, 2023.

వెబ్‌సైట్: https://careers.ecil.co.in

Next Story