నిరుద్యోగులు అలర్ట్. ఏదైనా డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు, త్వరపడండి

by Gugulothu.Kavitha |   (  Updated:2022-03-26 06:23:34  IST  )

నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ముంబై ప్రధాన కేంద్రంగానున్న బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టుల భర్తీకిManager jobs in Bank of Baroda

నిరుద్యోగులు అలర్ట్. ఏదైనా డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు, త్వరపడండి
X

నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ముంబై ప్రధాన కేంద్రంగానున్న బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 159

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 14

*ఇందులో బ్రాంచ్ రిసీవబుల్స్ మెనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. అలాగే సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*దరఖాస్తు ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.100 ఫీజు చెల్లించవచ్చు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.bankofbaroda.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.


Next Story