- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెన్త్, ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగాలు.. 2,402 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో గ్రూప్-C, గ్రూప్-D కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 2,402 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో గ్రూప్-C, గ్రూప్-D కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 2,402 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగి అర్హత ఉన్న వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 2,402
అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టును అనుసరించి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాలకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 23 జూన్ 2025
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్షలో సాధారణ జ్ఞానం, రీజనింగ్, గణితం, ఇంగ్లిష్ తదితర విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష తేదీలు: 2025 జులై 24 నుంచి ఆగస్టు 4 వరకు నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://ssc.gov.in/
ముఖ్య సూచనలు:
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి.
విద్యార్హతలు, వయసు ప్రమాణాలు, అవసరమైన డాక్యుమెంట్ల జాబితా మొదలైన వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
దరఖాస్తు చేసిన తర్వాత ఫీజు చెల్లింపు, అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్‌కు సంబంధించి వెబ్‌సైట్‌ను తరచూ చెక్ చేయాలి.






