టెన్త్, డిగ్రీ అర్హతతో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు, భారీగా జీతం, త్వరపడండి..

by Web Desk |

టెన్త్, డిగ్రీ అర్హతతో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు, భారీగా జీతం, త్వరపడండి..
X

నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్ మెంట్ (NCSCM) కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:


*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 104

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఫిబ్రవరి 23

*ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, రిసెర్చ్ అసిస్టెంట్, టెక్నికల్ ఇంజనీర్, అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్, గ్యాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్ పాసై ఉండాలి. అలాగే సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సబంధించి 35 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం స్కిల్ టెస్ట్, రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15000 నుంచి రూ.67000 వేతనం చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.ncscm.res.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story