బీటెక్ అర్హతతో పవర్ గ్రిడ్ లో జాబ్స్.. నెలకు రూ.లక్షకు పైగా వేతనం

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్Jobs in Power Grid Corporation of India Limited

బీటెక్ అర్హతతో పవర్ గ్రిడ్ లో జాబ్స్.. నెలకు రూ.లక్షకు పైగా వేతనం
X

నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL)లో పలు పోస్టుల భర్తీకి, నార్త్ రీజియన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 16

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 20

*ఇందులో డిప్లొమా ట్రైనీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

* ఎలక్ట్రికల్‌, సివిల్‌ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి 70శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా పాసై ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 2022 ఏప్రిల్ 20 నాటి అభ్యర్థులు వయసు 27 ఏళ్లకు మించరాదు.

*ఉద్యోగ ఎంపిక కోసం రాతపరీక్ష, మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.27,500. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత నెలకు రూ.1,17,500 వేతనం చెల్లిస్తారు.

*దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.powergrid.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story