బీటెక్ అర్హతతో NBCC(ఇండియా)లో ఉద్యోగాలు.. భారీగా జీతం, త్వరపడండి

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NBCC)లో పలు ఉద్యోగాల భర్తీకిJobs in NBCC (India)

బీటెక్ అర్హతతో NBCC(ఇండియా)లో ఉద్యోగాలు.. భారీగా జీతం, త్వరపడండి
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NBCC)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 81

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 14

*ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖ ాళీగా ఉన్నాయి. జూనియర్‌ ఇంజనీర్‌ (సివిల్‌)–60, జూనియర్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌)–20, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (సివిల్‌ ఇంజనీరింగ్‌)–01 పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

*జూనియర్ ఇంజనీర్ ఉద్యోగానికి సంబంధించి ఇంజనీరింగ్ డిప్లొమా పాసై ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 28 ఏళ్లకు మించరాదు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.27,270 వేతనం చెల్లిస్తారు.


*జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) ఉద్యోగానికి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా పాసై ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 28 ఏళ్లకు మించరాదు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.27,270 వేతనం చెల్లిస్తారు.


*డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉద్యోగానికి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ పాసై ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 46 ఏళ్లకు మించరాదు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.70,000 నుంచి రూ.200000 వేతనం చెల్లిస్తారు.


*జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

*డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగానికి పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.nbccindia.com వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story