ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, భారీగా వేతనం

by Web Desk |

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, భారీగా వేతనం
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకి చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ప్రాంతీయ కార్యాలయం విజయవాడలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫకేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 11

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 25

*ఇందులో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ పాసై ఉండాలి. 2021 వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. అలాగే సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 30 ఏళ్లకు మించరాదు.

*ఉద్యోగ ఎంపిక కోసం 2021 వాలిడ్ గేట్ స్కోర్ చూస్తారు. అలాగే ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60000 వేతనం చెల్లిస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తునుThe Regional Officer, Regional Office- Vijayawada, National Highway Authorities of India, Door No. 41-29-45A, RS No. 373 / 2A, Kodanda Ramalayam, Chalasani Nagar, Ranigari Thota, Krishnalanka, Vijayawada-520013, AP చిరునామకి పంపాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://nhai.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story