- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బీటెక్ అర్హతో IISc బెంగళూరులో ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి

బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISc), బెంగళూరులో హ్యూమన్ రిసోర్సెస్ సెక్షన్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 100(UR-42, OBC-25, SC-16, ST-7, EWS-10)
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఫిబ్రవరి 28
*ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి 55 శాతం మార్కులతో బీఈ, బీటెక్, బీఎస్సీ, బీసీఏ, బీవీఎస్సీ, బీ.ఆర్క్ పాసై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 2022 ఫిబ్రవరి 28 నాటికి 26 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్లకు సంబంధించి వయస్సు సడలింపు ఉంది.
*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 వేతనం చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
*దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://iisc.ac.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






