- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెన్త్, ఇంటర్,ఎంబీబీఎస్ అర్హతతో ICMR-NIAలో ఉద్యోగాలు, నెలకు రూ.లక్ష వరకు వేతనం
నిరుద్యోగులకు మంచి అవకాశం. చెన్నైలోని ICMR-నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ(NIE)లో కాంట్రాక్ట్ విధానంలోJobs in ICMR-NIA

నిరుద్యోగులకు మంచి అవకాశం. చెన్నైలోని ICMR-నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ(NIE)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 12
*వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: 2022 మార్చి 25, 28, 29
*ఇందులో కన్సల్టెంట్ (ఎపిడిమియాలజీ)–01, జూనియర్ కన్సల్టెంట్(ఎపిడిమియాలజీ)–01, ప్రాజెక్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ల్యాబ్)–01, ప్రాజెక్ట్ జూనియర్ నర్సు–06, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్(స్టాటిస్టిక్స్)–01, ప్రాజెక్ట్ టెక్నీషియన్–02 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, ఏఎన్ఎం, ఎంబీబీఎస్, ఎండీ పాసై ఉండాలి. అలాగే సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ తో పాటు టెక్నికల్ నైపుణ్యం ఉండాలి.
*ఉద్యోగాన్ని అనుసరించి నెలకు రూ.15,800 నుంచి రూ.1,00,000 వరకు వేతనం చెల్లిస్తారు.
*ఇంటర్వ్యూ వేదిక: ICMR – NIE, Second Main Road, TNHB, Ayapakkam, Chennai – 600077.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.nie.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






