బీటెక్ అర్హతతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, నెలకు రూ.50వేల వరకు వేతనం

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి Jobs in Bharat Electronics Limited

బీటెక్ అర్హతతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, నెలకు రూ.50వేల వరకు వేతనం
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 15

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 23

* ఈసీఈ–10, మెకానికల్‌–05 విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఫుల్‌టైం బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజినీరింగ్‌) పాసై ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధింది 2022 మార్చి1 నాటికి 32 ఏళ్ల వయస్సు మించకూడదు.

*ఉద్యోగ ఎంపిక కోసం బీఈ, బీటెక్, బీఎస్సీ లో సాధించిన మెరిట్ మార్కులు, ఎక్స్ పీరియన్స్ చూస్తారు. అలాగే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.40,000, రెండో ఏడాది నెలకు రూ.45,000, మూడో ఏడాది నెలకు రూ.50,000, నాలుగో ఏడాది నెలకు రూ.55,000 వేతనం చెల్లిస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తును Senior Deputy General Manager (HR), Naval Systems SBU, Bharat Electronics Limited, Jalahalli Post, Bangalore-560013, Karnataka చిరునామకు పంపించాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.bel-india.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story