ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌‌లో ఉద్యోగాలు

by Yella Dhawani Reddy |

కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ విభాగానికి చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ఒప్పంద ప్రాతిపదికన వివిధ ప్రాజెక్టుల్లో 76 పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌‌లో ఉద్యోగాలు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ విభాగానికి చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ఒప్పంద ప్రాతిపదికన వివిధ ప్రాజెక్టుల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 76 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

* మొత్తం ఖాళీలు:

ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-III: 04

ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II: 16

ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I: 09

ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 17

ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌: 15

* అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో ఓషనోగ్రఫీ, అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌, జియోఇన్ఫర్మేటిక్స్‌, ఫిజిక్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ తదితర విభాగాల్లో మాస్టర్స్‌/ బ్యాచిలర్స్‌ లేదా తత్సమాన డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. ఉద్యోగానుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

* వయసు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-IIIకు 45 ఏళ్లు, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-IIకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-Iకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ & అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌కు 50 ఏళ్లు మించకూడదు.

* వేతనం: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-IIIకు రూ.78,000, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-IIకు రూ.67,000, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-Iకు రూ.56,000, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.20,000, సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌కు రూ.18,000 ఉంటుంది.

* ఎంపిక: సైంటిస్టు పోస్టులకు ఇంటర్వ్యూలు, అసిస్టెంట్లకు రాత పరీక్షతో ఆధారంగా ఉంటుంది.

* పరీక్ష, ఇంటర్వ్యూల కేంద్రం: హైదరాబాద్‌.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30 జూన్ 2025.

* వెబ్‌సైట్‌: https://incois.gov.in/

Next Story