- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
JEE Main: జేఈఈ మెయిన్ సెషన్-1 కీ విడుదల.. రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన IIT, NITల్లో బీటెక్, బీఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షల ప్రాథమిక 'కీ' (JEE Main 2025 Preliminary Key) మంగళవారం విడుదలైంది

దిశ, వెబ్ డెస్క్: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన IIT, NITల్లో బీటెక్, బీఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షల ప్రాథమిక 'కీ' (JEE Main 2025 Preliminary Key) మంగళవారం విడుదలైంది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో కీ అందుబాటులో ఉంది. విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్‌సైట్లో పెట్టినట్లు జాతీయ పరీక్షల సంస్థ (NTA) వెల్లడించింది. జేఈఈ మెయిన్ (JEE Main 2025) సెషన్-1 ఆన్సర్ల కోసం అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇక ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున (నాన్ రిఫండబుల్) చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది కీ, ఫలితాలను వెల్లడిస్తారు. ఫిబ్రవరి 12 నాటికి జేఈఈ మెయిన్ (Joint Entrance Examination JEE Main) ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
జనవరి 22 నుంచి 29 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 6వ తేదీ రాత్రి 11.50 గంటల లోపు పంపవచ్చని NTA తెలిపింది. అలాగే, జనవరి 23న తొలి విడత భౌతికశాస్త్రంలో ఒక ప్రశ్నను విరమించుకోగా, దాని






