బాంబే ఐఐటీ విద్యార్థులకు జాక్ పాట్... రూ. కోటికి పైగా ప్యాకేజీలు!

by Geesa Chandu |
బాంబే ఐఐటీ విద్యార్థులకు జాక్ పాట్... రూ. కోటికి పైగా ప్యాకేజీలు!
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బాంబే (IIT Bombay) లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్లేస్ మెంట్స్ నివేదిక విడుదలైంది. పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాల కోసం మొత్తం 2,414 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 1,979 మంది మాత్రమే ఈ ఇంటర్వ్యూ లో ఆక్టివ్ గా పాల్గొన్నారు. అయితే వీరిలో 1,475 మంది ఆఫర్లు అంగీకరించినట్లు ఐఐటి బాంబే తెలిపింది. ఎంపికైన విద్యార్థుల సగటు వార్షిక వేతనం రూ.23.50 లక్షలు కాగా, మధ్యస్థంగా రూ.17.92 లక్షలుగా ఉందని వెల్లడించింది. అయితే వీరిలో 22 మంది విద్యార్థులు రూ.కోటి మరియు అంతకుమించి వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలకు అంగీకరించగా, 78 మంది విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగ ఆఫర్లు పొందారని తెలిపింది. ఇందులో దాదాపుగా 364 కంపెనీలు 1,650 ఉద్యోగాలను ఆఫర్ చేయగా.. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలోనే భారీగా ఆఫర్లు వచ్చినట్లు సంస్థ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed