- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ITBP Constable Recruitment 2025: పది పాస్ అయ్యారా.. అయితే, ఈ జాబ్స్ మీ కోసమే!
10 వ తరగతి పాస్ అయిన వారు అర్హులు

దిశ, వెబ్ డెస్క్ : ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) రిక్రూట్‌మెంట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 133 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతుంది. 10వ తరగతి చదివిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ 04-03-2025 మొదలయ్యి 02-04-2025 న ముగుస్తుంది. అభ్యర్థులు ITBP వెబ్‌సైట్, itbpolice.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ, అర్హత ,దరఖాస్తు విధానానికి సంబంధించిన అన్ని వివరాల కోసం, అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.
అప్లికేషన్ ఫీజు : జనరల్ / ఓబీసీ కేటగిరి వాళ్ళు రూ. 100 ను చెల్లించాలి.
ఎస్సి / ఎస్టీ / మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 04-03-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 02-04-2025
వయస్సు: కనీస వయో పరిమితి: 18 సంవత్సరాలు,
గరిష్ట వయోపరిమితి: 23 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది.
అర్హత: 10 వ తరగతి పాస్ అయిన వారు అర్హులు
అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.






