Indian Coast Guard: టెన్త్ ఆపై అర్హత సాధించిన అబ్బాయిలకు సూపర్ న్యూస్.. నెలకు రూ.40 వేలతో అదిరిపోయే ఉద్యోగం

by Yella Dhawani Reddy |

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్‌ (Indian Coast Guard) నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్, నావిక్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది.

Indian Coast Guard: టెన్త్ ఆపై అర్హత సాధించిన అబ్బాయిలకు సూపర్ న్యూస్.. నెలకు రూ.40 వేలతో అదిరిపోయే ఉద్యోగం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్‌ (Indian Coast Guard) నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్, నావిక్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ రెండు విభాగాల్లోనూ మొత్తం 300 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అబ్బాయిలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్టులు, వైద్య పరీక్షలతో నియామకాలు చేపడతారు. శిక్షణ అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు.

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్, జనరల్‌ డ్యూటీ విభాగాల వారికి INS చిల్కలో ప్రాథమిక శిక్షణ ఉంటుంది. అనంతరం సంబంధిత కేంద్రాల్లో ట్రేడ్‌ శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. బేస్ సాలరీ రూ.21,700తో పాటు అన్ని అలవెన్స్‌లు కలపి సుమారు రూ.40,000 మొదటి నెల నుంచే పొందవచ్చు.

పోస్టుల వివరాలు: నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్‌‌లో 40 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. నావిక్‌ జనరల్‌ డ్యూటీ విభాగంలో 260 ఖాళీలు ఉన్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారు అర్హులు.

వయసు: పై రెండు పోస్టులకూ సెప్టెంబరు 1, 2003 నుంచి ఆగస్టు 31, 2007 మధ్య జన్మించినవారు అర్హులు.

దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 25

పరీక్షలు: స్టేజ్‌ 1 ఏప్రిల్‌లో నిర్వహిస్తారు.స్జేజ్‌ 2 జూన్‌లో, స్టేజ్‌ 3 సెప్టెంబరులో ఉంటాయి.

వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.cdac.in/cgcat/

Next Story