గుడ్‌న్యూస్.. 4045 బ్యాంకు క్లర్క్ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల

by Disha Web Desk 21 |
గుడ్‌న్యూస్.. 4045 బ్యాంకు క్లర్క్ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 2024 - 2025 ఏడాదికి సంబంధించి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ) -XIII నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,045 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 11 రకాల ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.

అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు కనీస కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రెండు దశల్లో సీబీటీ పరీక్ష నిర్వహిస్తారు. మొదటిది 100 మార్కులకు ప్రిలిమ్స్, రెండోది 200 మార్కులకు మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తే మెయిన్స్ రాసే వీలుంటుంది.

దరఖాస్తు ప్రారంభ తేదీ: జులై 1, 2023

చివరితేదీ: జులై 21, 2023

ప్రిలిమినరీ : ఆగస్టు 2023 లేదా సెప్టెంబర్ 2023

మెయిన్స్: అక్టోబర్ 2023లో ఉంటుంది.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ibps.in/

Next Story

Most Viewed