- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రాడ్యూయేషన్ ఉత్తీర్ణులయ్యారా?.. అయితే రాత పరీక్ష లేకుండానే డీఆర్‌డీవో ఉద్యోగవకాశాలు
గ్రాడ్యూయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు శుభవార్త. ఎలాంటి రాత పరీక్ష లేకుండా భారత ప్రభుత్వానికి చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)లో ఉద్యోగవకాశాలు లభించనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: గ్రాడ్యూయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు శుభవార్త. ఎలాంటి రాత పరీక్ష లేకుండా భారత ప్రభుత్వానికి చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)లో ఉద్యోగవకాశాలు లభించనున్నాయి. నాసిక్‌లోని డీఆర్‌డీఓ- అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ఎనర్జిటిక్ మెటీరియల్స్ (ACEM) 2025-26 సంవత్సరానికి 41 గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 30
డిప్లొమా (టెక్నీషియన్ అప్రెంటిస్)- 11
అర్హతలు: డిప్లొమా, బీఈ/ బీటెక్.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ పోస్టులకు నెలకు రూ.12,000, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ. 10,000.
ఎంపిక: మెరిట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు: [email protected] ఐడీకి వివరాలను మెయిల్ చేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 15 జూన్ 2025.
వెబ్‌సైట్: https://drdo.gov.in/drdo/careers






