UPSC : యూపీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

యూపీఎస్సీ(UPSC) అభ్యర్థులకు మరో శుభవార్త.

UPSC : యూపీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : యూపీఎస్సీ(UPSC) అభ్యర్థులకు మరో శుభవార్త. యూపీఎస్సీ దరఖాస్తుల(UPSC Applications) గడువు మరోసారి పొడగించింది యూపీఎస్సీ. ఈనెల 21వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటన జారీ చేసింది. కాగా తొలుత ప్రకటించిన తేది ప్రకారం జనవరి 22న మొదలై ఫిబ్రవరి 11తో ముగియగా.. దానిని 18వ తేదీ వరకు పొడిగిస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. అయితే అభ్యర్థుల నుంచి వస్తున్న వినతుల మేరకు మరోసారి ఆ గడువును మరో మూడు రోజుల పాటు అంటే ఫిబ్రవరి 21 వరకు పొడిగించింది. 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025(CSE 2025) జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. యూపీఎస్సీ తాజా నిర్ణయంతో అభ్యర్థులు 22వ తేదీ సాయంత్రం 6 వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్స్ లో ఏవైనా పొరపాట్లు ఉంటే ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ కల్పించింది. ఇక 150 పోస్టులకు విడుదలైన ఐఏఎఫ్(IFS) దరఖాస్తుల గడువు కూడా ఫిబ్రవరి 21 వరకు పొడిగిస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

Next Story