గ్రాడ్యూయేషన్ ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బెల్‌లో మంచి జీతంతో ఉద్యోగవకాశాలు

by Yella Dhawani Reddy |

ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

గ్రాడ్యూయేషన్ ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బెల్‌లో మంచి జీతంతో ఉద్యోగవకాశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయబోతోంది. వీటిలో ట్రెయినీలు మూడేళ్లకు, ప్రొఫెషనల్స్ నాలుగేళ్లకు నియమించబడతారు. ఆస్తకి కలిగి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, అర్హతలు ఇలా ఉన్నాయి.

పోస్టుల వారీగా ఖాళీలు:

సీనియర్ సాఫ్ట్‌వేర్ ట్రెయినీ: 15

జూనియర్ సాఫ్ట్‌వేర్ ట్రెయినీ: 15

సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్: 10

అర్హతలు:

సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ట్రెయినీ: ఎంసీఏ/ ఎంఎస్సీ (సీఎస్‌) పూర్తిచేయాలి. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, టెస్టింగ్‌-ఐటీ సపోర్ట్‌ అండ్‌ మెయింటెనెన్స్‌లో ఏడాదికి పైగా అనుభవం ఉన్నవారి ప్రాధ్యానత ఉంటుంది.

జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ట్రెయినీ: బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధ్యానత ఉంటుంది.

సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌: బీఈ/బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ డేటా సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌/ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులై, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ టెస్టింగ్‌ రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి.

వయో పరిమితి: జూన్ 1వ తేదీ 2025 నాటికి సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ట్రెయినీకి 28 ఏళ్లు, జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌కు 26 ఏళ్లు, సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌కు 40 ఏళ్లు ఉండాలి.

వేతనం:

సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ట్రెయినీకి మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది రూ.40,000, మూడో ఏడాది రూ.45,000 ఉంటుంది

జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ట్రెయినీకి మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది రూ.28,000, మూడో ఏడాది రూ.31,000 ఉంటుంది.

సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌కు మొదటి ఏడాది నెలకు రూ.60,000, రెండో ఏడాది రూ.65,000, మూడో ఏడాది రూ.70,000, నాలుగో ఏడాది రూ.75,000 ఉంటుంది

అలాగే ప్రతి ఏటా మెడికల్‌ ఇన్‌స్యూరెన్స్‌ ప్రీమియం, ఇతర అలవెన్సుల నిమిత్తం రూ.12,000, సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌కు రూ.20,000 చెల్లిస్తారు.

ఎంపిక:

సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ట్రెయినీ, జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ట్రెయినీలను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇది 100 మార్కులకు ఉంటుంది.

సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌‌కు రాత పరీక్ష, ఇంటర్వ్యూ రెండూ ఉంటాయి. రాత పరీక్షను 85 మార్కులకు నిర్వహిస్తారు. దీంట్లో కనీసార్హత మార్కులు పొందిన వారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 30 జూన్ 2025

వెబ్‌సైట్‌: http://www.bel-india.in/

Next Story