- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bank Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నోటిఫికేషన్ విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 350 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO) పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతుంది. B.Tech /BE, CA, ICWA, MBA/PGDM, MCA, PG డిప్లొమా ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 03-03-2025న ప్రారంభమై 24-03-2025న ముగుస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు PNB వెబ్‌సైట్, pnbindia.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
అప్లికేషన్ ఫీజు :
SC/ST/PwBD కేటగిరీ అభ్యర్థులకు: రూ. 50/- + GST @18% = రూ. 59/- (పోస్టేజ్ ఛార్జీలు మాత్రమే)
ఇతర కేటగిరీ అభ్యర్థులకు: రూ. 1000/- + GST @18% = రూ. 1180/- చెల్లించాలి.
PNB రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 03-03-2025
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీ: 24-03-2025
వయస్సు :
సీనియర్ మేనేజర్ (ఐటీ) వయోపరిమితి: 27 నుండి 38 సంవత్సరాలు
మేనేజర్ (డేటా సైంటిస్ట్) వయోపరిమితి: 25 నుండి 35 సంవత్సరాలు
సీనియర్ మేనేజర్ (డేటా సైంటిస్ట్) వయోపరిమితి: 27 నుండి 38 సంవత్సరాలు
మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ) వయోపరిమితి: 25 నుండి 35 సంవత్సరాలు
సీనియర్ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ) వయోపరిమితి: 27 నుండి 38 సంవత్సరాలు
నియమాల ప్రకారం వయోపరిమితి వర్తిస్తుంది.
అర్హత :
అభ్యర్థులు B.Tech/B.E, CA, ICWA, MBA/PGDM, MCA, PG డిప్లొమా (సంబంధిత రంగాలు) కలిగి ఉండాలి.
PNB స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO) రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు:
ఆఫీసర్ ( క్రెడిట్ ) - 250
ఆఫీసర్ ( ఇండస్ట్రీ ) - 75
మేనేజర్ ( ఐటీ ) - 05
సీనియర్ మేనేజర్ ( ఐటీ ) - 05
మేనేజర్ ( డేటా సైంటిస్ట్ ) - 03
సీనియర్ మేనేజర్ ( డేటా సైంటిస్ట్ ) - 02
మేనేజర్ ( సైబర్ సెక్యూరిటీ ) - 05
సీనియర్ మేనేజర్ ( సైబర్ సెక్యూరిటీ ) - 05






